మన గన్నవరం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322


 మా అమ్మాయి పద్మజ కళాశాలలో చదువుతున్న రోజులలో  మా అమ్మ  అమ్మాయికి పెళ్లి చేద్దాం  ఆలస్యం చేస్తే నేను చూస్తానో లేదో అంటూ ఒక మంచి సంబంధం ఉంది చేద్దాం అని బలవంతం చేస్తే  నేను అరుణ వెళ్లి చూశాం  ఆదర్శాలు కల వ్యక్తి  విశ్వవిద్యాలయంలో  ప్రథమ శ్రేణిలో ఎం కామ్ పాసైన వాడు. అణకువ తన కాళ్ళ పై తాను నిలబడాలి అనుకున్న  కుర్రవాడు  నేను కట్నం తీసుకోలేదు నేను కట్నం ఇవ్వను  అమ్మాయి నచ్చితే చేసుకోండి  అంటే నేను కట్నం అడగలేదు కదా అన్నాడు  అలా అమ్మాయి వివాహం జరిగింది  నెల్లూరులో కొంత పొలం కొని  కొత్త రకాలను ప్రవేశపెట్టి  వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. శ్రీ వరి రకాన్ని నెల్లూరుకు  పరిచయం చేసింది ఆయనే. ఆ సంవత్సరం  ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు  రైతులను దృష్టిలో పెట్టుకొని  పంటలు ఎక్కువ పండితే తప్ప దేశం బాగుపడదు  అన్న అభిప్రాయంతో రైతులను  ఉత్సాహపరిచేందుకు  ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రైతును ఉత్తమ రైతుగా ఎన్నిక చేయడం నెల్లూరు జిల్లాకు మా అల్లుడు కోటిరెడ్డిని  ఎన్నుకోవడం జరిగింది  రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిన మాట  మీరు ఉద్యోగస్తులు కాదు  కానీ మీ కోసం ప్రతి నెల 5000 రూపాయలు మీకు పంపిస్తాను  మీరు రైతు సంఘాలను ఏర్పాటు చేసి వారందరికీ ఎలాంటి  విత్తనాలను ఎన్నుకోవాలి  ఎలా పండించాలి అన్న కొత్త విషయాలను వారికి తెలియజేస్తూ ఉంటే  నేను ఇచ్చిన డబ్బులు దారి ఖర్చులకు మాత్రమే  అని స్పష్టంగా చెప్పారు. అలా నెల్లూరులో  రైతులతో సాన్నిహిత్యం ఏర్పాటు చేసి  వారందరినీ రైతు సంఘాలుగా  మార్చి  వారందరితో  సభలు సమావేశాలు జరుపుతూ  అంత క్రితం కన్నా ఎక్కువ రాబడి  తీయడానికి దోహదపడ్డాడు  మా అమ్మాయి కూడా  స్త్రీలను సంఘాలుగా ఏర్పాటు చేసి  వారందరికీ  కొత్త విషయాలు తెలియ చేస్తూ వారు ఖాళీగా ఉన్న సమయంలో ధనాన్ని ఎలా సంపాదించాలి అన్న విషయాన్ని గురించి వారు చేయగలిగిన పనులను చెప్పి వారిని కూడా సంపాదనా పరులుగా చేసింది  దానితో స్త్రీలు అంతా కలిసిమెలిసి  అనేక కార్యక్రమాలను  నెల్లూరులో చేశారు. ప్రస్తుతం కోటి రెడ్డి గారు  మన రాష్ట్ర  రైతు సేవా సమాఖ్యకు  సంచాలకులుగా  పనిచేస్తున్నారు. ఆయన జీవిత ఆశయం నెరవేర్చుకుంటున్నారు.


కామెంట్‌లు