మన గన్నవరం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 పార్టీ నాయకులు విడుదలైన తర్వాత జనశక్తి దినపత్రికగా మారిన కొన్నాళ్లకు అది మార్సిస్టలెనిస్టుల చేతికి పోయింది ఆ తర్వాత ప్రారంభమైన ప్రజాశక్తి మొదటి వార పత్రికగా తర్వాత ద్వైవార పత్రికగా మారింది  బొమ్మా రెడ్డి తెలుగు పత్రిక అమ్ములు గుర్తింపు తెచ్చుకోవడమే గాక తన సంపాదకత్వంలో ప్రజాశక్తికి గుర్తింపు తెచ్చారు  అలా 50 ఏళ్ల పత్రిక జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న  బొమ్మా రెడ్డి  1996లో అనారోగ్యం వల్ల సంపాదకత్వం అని వదులుకున్నారు బొమ్మా రెడ్డి పత్రికా జీవితంలో కష్టాలు తప్ప సుఖాలు లేవు బొమ్మా రెడ్డి దాదాపు 50 పుస్తకాలు రాశారు అన్నీ పార్టీ చీలిక తర్వాత రాసినవే  ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన అన్ని పత్రికల్లో పని చేసిన అనుభవం  ప్రజాశక్తి లాంటి పత్రికల్ని ప్రజాపత్రికలుగా తీర్చిదిద్దిన ఖ్యాతి బొమ్మారెడ్డిదే.నేను మా అన్నయ్య  వామపక్ష సిద్ధాంతాలకు అనుగుణంగా  అన్నయ్య చెప్పడం నేను వ్రాయడం  ప్రజల కోసం అన్నలాటికను ప్రదర్శన కోసం  వ్రాశాం  దానిలో రచన  సరళంగా సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే పద్ధతిలో కొనసాగింది  దానిలో మేం తీసుకునే విషయం కూడా  ఒక జమీందారు వర్గానికి కార్మిక వర్గానికి మధ్య  జరిగిన  పోరాటాన్ని గురించి  రెండు స్త్రీ పాత్రలను కూడా దానిలో ఇమిడ్చి  రాశాం  మామయ్య దగ్గరికి ప్రచురణ కోసం వెళితే రంగస్థల ప్రదర్శన కోసం రాసిన నాటకాలకు  పత్రికలో రావలసిన నాటకాలకు సంబంధం ఉండదు  దీని పద్ధతి వేరు దాని పద్ధతి వేరు  ఇది చూస్తారు అది చదువుతారు ఆ భేదం తెలియకుండా మీరు రాస్తే  దానిని ఎలా ప్రచురిస్తాం మీకు నాకు కూడా చెడ్డపేరు వస్తుంది అని తిరస్కరించారు ఎంతో సున్నితంగా  అలాంటి కార్య దక్షుడు మా మామయ్య.
నా వివాహానికి పూర్వం  అంటే దాదాపు పది రోజులు ముందు  అప్పటి కమ్యూనిస్టు పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన వెల్లంకి విశ్వేశ్వరరావు గారిని తీసుకొని  నన్ను కలిశారు  ఏరా నీకు  కట్నం ఎంత కావాలో చెప్పు  వారికున్న ఆస్తి మొత్తం  ఇవ్వమన్నా ఇస్తారు  నీవు ఎలా చెప్తే అలా అన్నారు  అదేమిటి మామయ్య  నేనేమైనా  అమ్ముడు పోయే పందెపు గిత్తనా  నేను కట్నం తీసుకోను  ఒకవేళ బలవంతంగా లాంఛనం  కోసం ఇచ్చినా నేను ఈ వివాహం చేసుకోను  అనేసరికి వారిద్దరూ ఎంతో ఆనందించి  నా మేనల్లుడివి అనిపించవురా  నాకెంతో ఆనందంగా ఉంది ఈ క్షణం  మీ నాన్న ఆశయాలకు ఆదర్శంగా నిలబడే నీ తత్వం  ఉన్నతమని తెలుసు కానీ ఇంత ఉన్నతమైనదని తెలియదు  అని కౌగిలించుకొని  అభినందించారు ఇద్దరూ కూడా  అది మా మామయ్య తత్వం.


కామెంట్‌లు