తాను ఉద్యోగం చేస్తున్న సమయంలోనే ఆంధ్రజ్యోతి వార పత్రిక వారు నవలల పోటీ ఏర్పాటు చేశారు ఆకాశవాణి ఉద్యోగి అయిన శంకరమంచి సత్యం పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు కలిసి ఆ కార్యక్రమాన్ని చేయడానికి పూనుకున్నారు వార పత్రికల్లో అలా ఉత్తమ నవలలు ఎన్నిక చేసే ప్రక్రియ మొదటిసారి ఆంధ్రజ్యోతి వార పత్రిక వారు ప్రారంభించారు ఆ అనే నవల వ్రాసి పంపాడు స్మైల్ శంకరమంచి సత్యానికి స్మైల్ నా స్నేహితుడని తెలుసు అతనికి నచ్చిన ఆ నవల మరో రెండు నవలలు నాకు ఇచ్చి ఈ మూడిట్లో ఏది బాగుందో ఎన్నిక చేయమని చెప్పాడు అయితే దానిలో ఎవరి చిరునామాలు లేవు నేను మూడు చదివిన తర్వాత ఇది బాగుందని చెబితే ఏమిటి నీ స్నేహితుడు అని అంటున్నావా అన్నాడు.
నా స్నేహితుడు ఎవడండి నాకు తెలిసిన ఎవరూ కూడా నవలలు రాసేవాడు లేరు అని మామూలుగా చెప్పేసరికి నీ ప్రాణ స్నేహితుడు ఇస్మాయిల్ అనేసరికి నాకు ఆశ్చర్యం వేసింది అంతవరకు వాడు రచనా వ్యాసంగంలో నవలా ప్రక్రియ లేదు అలాంటివాడు అంత అందంగా కథా వస్తువును ఎన్నుకొని దానికి తగిన పాత్రలను నిర్ణయించుకొని ఆ పాత్రలకు తగిన భాషను ఉపయోగించి ఎక్కడ విసుగు కలగకుండా మంచి వరవడితో రాసిన నవల ఇంత సత్తా మావాడికి ఎక్కడి నుంచి వచ్చింది అబ్బా అని ఆలోచనలో పడ్డా సమాధానం దొరకలేదు నేను వాడికి ఈ విషయం చెప్పలేదు కారణం నా స్నేహితుడు గనుక బహుమతి వచ్చింది అన్న ముద్ర పడుతుంది అందుకోసం రహస్యంగా ఉంచాను.కాకినాడ నుంచి ఎప్పుడు నన్ను చూడాలనుకున్న జీపులో విజయవాడ వచ్చి నన్ను తీసుకొని వెళ్లి రాధా తో సహా వాడికి నచ్చిన మా పాఠశాల అక్కడ మేము తిరిగిన స్థలాలు దేవాలయాలు వాడికి చాలా బాగా నచ్చి జీవితంలో దానికే అంకితమైన ఒకే ఒక స్థలం వేమన గ్రంథాలయం అక్కడ చాలా సేపు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ పాత వ్యక్తులను అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ మా సహ విద్యార్థుల క్షేమ సమాచారాలు ఎలా ఉన్నాయో చర్చించుకుంటూ వారితో జరిగిన మాటల్ని ఆటల్ని పాటల్ని అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ కాలక్షేపం చేసే వాళ్ళం. అలా చాలా సరదాగా కాలం గడిచిపోయేది మాతో ఒకటి రెండు రోజులు ఉండి వెళ్ళేవాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి