ఛత్రపతి శివాజీ( అష్టాక్షరీ గీతి ప్రక్రియ., ) "కవిమిత్ర" శంకర ప్రియ., శీల.,-సంచార వాణి: 99127 67098
          1️⃣
    ఛత్రపతియే శివాజీ!
ధర్మమూర్తియే శివాజీ!
    దేశభక్తుడే శివాజీ!
 హరోంహరా! హరోంహరా! 
             2️⃣
    విశ్వవిఖ్యాత మైనట్టి
 ఆర్షధర్మంను తిరిగి
    ఉద్ధరించిన రారాజు!
  హరోంహరా! హరోంహరా!   
             3️⃣
      మన సనాతనమైన
  భారతీయ ధర్మమును
      సంరక్షించిన నేతాజీ!
  హరోంహరా! హరోంహరా! 
               4️⃣
     ధైర్య, సాహసవంతుడు
 ఈనాటి తరమునకు
     యువకేసరి శివాజీ!
  హరోంహరా! హరోంహరా!   
              5️⃣
      విధర్మీయు లందరికీ
 కన్నులు తెరిపించిన
      ధర్మ యోధుడు శివాజీ!
 హరోంహరా! హరోంహరా!
              6️⃣
     జాతీయ సమైక్యతను
 రేకెత్తించిన ధీరుడు!
      ఆత్మ బంధువు శివాజీ!
 హరోంహరా! హరోంహరా! 
      "జయ జయ శివాజీ! ఛత్రపతి! శివాజీ!"

కామెంట్‌లు