ప్రకృతి పాడిన పాట;- ప్రభాకర్ రావు గుండవరం (మిత్రాజీ )- ఫోన్ నం.9949267638-అత్వెల్లి, మేడ్చల్ జిల్లా
కొండమల్లె పూలతో
కొనంతా నిండింది
పచ్చని ప్రకృతికి
వన్నెలెన్నో తెచ్చింది  !! కొండ మల్లె!!

ఉషోదయ కిరణాలతో 
పూలు విరబూసినవి
వాసంతి రాక కోసం 
నేలపైన రాలినవి    !! కొండ మల్లె!!

పచ్చని పట్టు పాన్పులా
వసుధ మెరుస్తూన్నది
సుగంధ పరిమళాలతో
ప్రకృతి పరవశిస్తూన్నది. !! కొండ!!

కుహూ కుహూ కోయిలమ్మ
రాగాలే పాడుతున్నది
అందాల నెమళ్ళు
నాట్యాలే చేస్తున్నాయి !! కొండ మల్లె

ఎంతో చక్కని దేశం 
అందమైన మన దేశం
ప్రకృతి సౌందర్యాలకు
ఆటపట్టు మన ఊళ్ళు !! కొండ మల్లె 
********


కామెంట్‌లు