పుట్టిన పసిబిడ్డకు తొలి పరిచయం
అమ్మ తొలిదీపపు కాంతి,
ఇంటికి ఇల్లాలే దీపపు క్రాంతి.
తొలిఆడుగులు వేసేవేళ తప్పటడుగులు
వేయించే తల్లి దీపపు క్రాంతి
బడిలో ప్రమిదలో నూనెలాoటి
అజ్ఞానాన్ని ప్రారద్రోలి,
వత్తి లాంటి జ్ఞానాన్ని వెలిగించుతూ
వెలిగే జ్వలలా మనకు జ్ఞానాన్ని అందించేది గురువు.
ఎదుగుతున్న బిడ్డలకు సరిఅయిన
దారిచూపుతూ,
తప్పుమార్గాన వెళ్లే బిడ్డలకు మంచిబుద్దులు చెప్పుతూ జీవితాన్ని సరిదిద్దేది తండ్రి అద్భుత దీపక్రాంతి
సమస్యల వలయాన చిక్కుకున్న,
జీవితంలో ఒంటరిగా మిగిలి
ఎటువెళ్ళాలో దారితెలీని
స్థితిలో హితంచెప్పే స్నేహితులరూపంలో
కనపడే వారే మనజీవిత మార్గాన వెలిగేదీపం!
సంసార బంధంలో, అలుమొగల తోడు నీడ,
కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ,
ఒకరి అభివృద్ధి ఇంకొకరు ప్రోత్సహపరుస్తూ,
ఉంటే అదే దాంపత్య దీపం!
ఆ దీపపు వెలుగే కన్న బిడ్డలు!
ఒకరి అభివృద్ధి ఇంకొకరు ప్రోత్సహపరుస్తూ,
ఉంటే అదే దాంపత్య దీపం
అదీపపు వెలుగే కన్న బిడ్డల బంగారు భవిష్యత్తు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి