రాజేష్ బామ్మ కథ; కె. ఉషశ్రీ - 9వ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల - నీర్మాల.
  అనగనగా ఒక ఊరిలో ఒక బామ్మ ఉండేది. ఆ బామ్మతో ఒక మనవడు ఉండేవాడు. మనవని పేరు రాజేష్. ఆ బామ్మ రాజేష్ ఒక చిన్న ఇంట్లో ఉంటారు. ఆ బామ్మ రాజేష్ ను ప్రతిరోజు బడికి పంపుతుంది. ఆ బామ్మ ఇండ్లలో పనులు చేసి బడికి పంపుతుంది. ఒకరోజు మనవడు పుస్తకాలు కొనుక్కోవాలి అని బామ్మను డబ్బులు అడిగాడు. ఆ బామ్మ అయ్యో మనవడా నేను ఇప్పుడే దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చాను. నేను ఇంకా రెండు రోజులకు కొనిస్తాను అని బామ్మ అన్నది. రాజేష్ తెల్లారి బడికి వెళ్ళిండు. బడిలో సార్ పుస్తకాలు ఏమిరా అని అన్నాడు. రాజేష్ సార్ మా బామ్మ దగ్గర డబ్బులు లేవు. నిన్ననే సరుకులు తెచ్చింది. రెండు రోజులకు కొనిస్తాఅన్నది. సార్ సరే రా అని సార్ అన్నాడు. రాజేష్ ఇంటికి వచ్చి బామ్మ రెండు రోజులు  అయ్యింది.కదా పుస్తకాలు కొనివ్వు అని అన్నాడు రాజేష్. నాకు చాతనైతలేదు బిడ్డ. నేను పనికి వెళ్లడం లేదు కదా నా దగ్గర డబ్బులు లేవు అని బామ్మ అన్నది. రాజేష్ మరుసటి రోజు బడికి వెళ్లలేదు రాజేష్ స్కూల్ కి వెళ్లలేదు రాజేష్ కూలీ పనికివెళ్లి పుస్తకాలు కొనుక్కున్నాడు. బామ్మ కి చాతన అయితలేదు అని రాజేష్. ఇంటి పని వంట పని చేసి బామ్మకు భోజనం పెట్టాడు. బామ్మ కు మందులు ఇచ్చాడు. కొద్ది రోజులలో బామ్మ లేచి పనులు చేసుకుంటుంది. బాబు ఇక నువ్వు బడికి వెళ్ళు అని బామ్మ రాజేష్ అన్నది. రాజేష్ బడికి వెళ్తున్నాడు. బామ్మ రాజేష్ సంతోషంగా జీవిస్తున్నారు.
నీతి,  పెద్దవారిని మనం గౌరవించాలి. పెద్దవారికి పనులలో సహాయం చేయాలి. పెద్దలు చెప్పిన మాటలు వినాలి. పెద్దవారిని మనం పోషించాలి. మనల్ని మన తల్లిదండ్రులు పోషిస్తారు.
కృతజ్ఞతలు.

కామెంట్‌లు