ఆవేశపు విల్లునెక్కుపెట్టి సప్తవ్యసనాల రాక్షసుని వధించు. దుష్టాలోచన చేసే దుర్మార్గులను దునుమాడు. కులమతాల కుత్సితబుధ్ధి కుటిలుల కుళ్ళణుచు. దైవదూషణచేసే పాపులను ప్రక్షాళించు. భాగవతోత్తముల బాధించే భండులను భంజించు. మన సంస్కృతీ సంప్రదాయాలను నాశనం చేసే వారిని నశింపజేయి. అవివేకుల అవిధేయకార్యాలను నిరోధించు. దుర్భర బాధల వలయాలను ఛేదించు. కారుచీకట్లలో కాంతిరేఖలను వెలిగించు. ప్రతివారిలోనూ నిబిడీకృతమై ఉండే అంతఃశక్తిని ప్రజ్వలింపజేయి. గాడితప్పినవారి నాడిని తెలిసి ప్రయోజనంవైపు ప్రభంజనంలా కదిలించు. మతిలేని ఆలోచనలను, గతితెలియని గమనాలను సుగతివైపునకు మళ్ళించు !!!
+++++++++++++++++++++++++
మళ్ళించు (చిట్టి వ్యాసం);- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి