తెర తారగా ఉన్న నీవు ఆకాశ తారగా మారడం మాకు నచ్చలేదు. చిత్ర కథకుడివిగా ఉన్న నీవు చిత్రగుప్తుడి సాయానికి వెళ్ళడం మాకు నచ్చలేదు. మాటల మాంత్రికుడివిగా ఉన్న నీవు దేవతలకు మంత్రాలు నేర్పడం మాకు నచ్చలేదు. నాటకాల్లో నటించి మెప్పించిన నీవు దివిలో నటించబోవడం మాకు నచ్చలేదు. సాహితీ రచనలో ఉన్న నీవు స్వర్గ చరిత రాయబోవడం మాకు నచ్చలేదు. ఎందరో పరిశోధకులకు దిక్సూచివైన నీవు సురలపై పరిశోధనకు వెళ్ళడం మాకు నచ్చలేదు. బహుముఖ ప్రజ్ఞాశాలివైన నీవు అక్కడెక్కడో ఏదో నేర్చుకుంటానని వెళ్ళడం మాకు నచ్చలేదు. కాలం చేసిన గాయాలకు
నీ రచనలే మందుగా చేసిన నీవు ఇలా మమ్మల్ని ఒదిలి స్వర్గానికి లంఘించి వెళ్ళడం మాకు నచ్చలేదు. సామాన్యుల్లో అసామాన్యుడవైన నీవు మాకు లేని లోటుగా ఉండడం మాకు నచ్చలేదు!!!
+++++++++++++++++++++++++
(విశేషనటులు గొల్లపూడి మారుతీరావు గారికి స్మృత్యంజలి)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి