- ఔదార్యం చాటిన బ్యాంకు సిబ్బంది
-ప్రధానోపాధ్యాయిని చొరవతో తీరిన తాగునీటి అవసరాలు
కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) కాల్వ శ్రీరాంపూర్ బ్రాంచ్ మేనేజర్ రాహుల్ తన సిబ్బందితో కలిసి రూ.16 వేల విలువైన నీటి శుద్ధి యంత్రాన్ని విరాళంగా అందజేసి, ప్రారంభించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య పిల్లల ఆరోగ్యం, తాగునీటి అవసరాల దృష్ట్యా, ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ఏర్పాట్లు పూర్తి చేశారు. పాఠశాలలో గ్రామపంచాయతీ కులాయి ఉన్నప్పటికీ, అది ఒక్కోసారి పనిచేయడం లేదు. పిల్లలు ఇంటి నుండి బాటిళ్లలో తెచ్చుకున్న నీరు సరిపోవడం లేదు. దీంతో పిల్లలు తాగునీటికి ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య పిల్లల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. దాతల ద్వారా నీటి శుద్ధి యంత్రాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఆయన వెంటనే కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ మేనేజర్ని కలిశారు. పాఠశాలలోని తాగునీటి సమస్య గురించి వివరించారు. దానికి పరిష్కార మార్గాలని తెలియజేశారు. పాఠశాల పిల్లల కోసం నీటి శుద్ధి యంత్రాన్ని ఇప్పించమని బ్యాంక్ మేనేజర్ రాహుల్ ను అడిగారు. పాఠశాల పిల్లలకు సహాయం చేయాలనే సంకల్పంతో బ్యాంకు మేనేజర్ రాహుల్ కుమార్ తమ సిబ్బందిని సమావేశపరిచి విషయం వివరించారు. మేనేజర్ రాహుల్ కుమార్ బ్యాంక్ సిబ్బంది సమాన భాగస్వామంతో రూ. 16,000 పోగు చేశారు. ఈ సొమ్ముతో పాఠశాల పిల్లలకు సరిపోయే నీటి శుద్ధి యంత్రాన్ని పాఠశాలకు బహూకరించి, తమ సహృదయతను చాటుకున్నారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు. గురువారం ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నీటి శుద్ధి యంత్రాన్ని బ్యాంకు మేనేజర్ రాహుల్ కుమార్ తన సిబ్బందితో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పాఠశాల పిల్లల తాగు నీటి అవసరాలను తీర్చిన ఎస్బీఐ మేనేజర్ రాహుల్ కుమార్ అతని సిబ్బందిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఎఫ్ఎల్ఎన్ శ్రీరాంపూర్ మండల నోడల్ అధికారి యర్రా రమేష్, ఉపాధ్యాయినులు విజయలక్ష్మి, సమత, భారతి, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ చిలువేరు లావణ్య, వైస్ చైర్మన్ తూండ్ల రాజు, సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది ప్రవీణ్ కుమార్, శ్రీకాంత్, కార్తీక్, ఎస్. రమేష్, ప్రధానోపాధ్యాయులు వై.రమేష్, ఈర్ల సమ్మయ్య ,ఉపాధ్యాయినులు ఎడ్ల విజయలక్ష్మి, కర్ర సమత, చెన్నూరి భారతి, పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థినీ, విద్యార్థులు, పలువురు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి