* తీరని దిగులు *;- కోరాడ నరసింహా రావు !
అన్నీ.. ఇచ్చిన అమ్మ ఈ మన నేల తల్లి....... !
  మననుండి తను, తనకోసం...
 ఏనాడూ, ఏమీ  కోరలేదు !!
. మన సుఖ, సంతోషాలే తనకానందం... అచ్చం మన అమ్మలాగే... !!
    
 
తన కడుపునే  పుట్టిన బిడ్డలు... 
  స్వార్ధం తో... నిరంతరం, కలహించుకుంటుంటే..., 
 కత్తులుదూసి...., 
   ప్రాణాలు తీసుకుంటుంటే..., తల్లడిల్లిపోయే బాధకన్నా... 
   తమలో తమ్ముకొట్టుకుంటూ 
ఎవడో... పరాయివాడికి... బానిసలై.... శతాబ్దాల కాలం ఊడిగం చేసినందుకు, తల్లడిల్లిపోతూ ఎంత కుమిలిపోయిందని.. !!

మన తప్పును మనం తెలుసుకుని..., చేతులు కాలిపోయినాక ఆకులు పట్టుకున్న చందాన...., 
        ఎన్ని అభ్యర్ధనలు !?
ఎన్నెన్ని బ్రతిమాలాటలు..., 
  ఎన్నెన్ని తిరుగుబాట్లు...., 
. ఎన్నెన్ని ప్రాణత్యాగాలు.... 
. ఎట్టకేలకు... ఎలాగైతేనేం... 
.  సాధించారు బిడ్డలని... 
   సంబరపడిపోయిన అమ్మ ఆనందం ఎంతసేపో నిలవలేదుకదా.. !!
      మన ఉదాసీనతే మానకొంప ముంచగా .... తల్లి ని రెండు ముక్కలు చేసి పంచుకున్నారన్న ఆవేదన, తప్పలేదు కదా  ఈ అమ్మకు... !
        ఇంతజరిగినా... అంతా మరచి చేసిన తప్పునే మళ్ళీ - మళ్ళీ చేస్తుంటే.... మన అజ్ఞానానికి మౌనరోదనే అమ్మవంతయింది.... !!

అవే... కులమతాల కుమ్ములాటలు !
  అవే... అసమానతలు !
  దోపిడీ, దౌర్జన్యాలు తొలగిపోకపోగా.... మరింత ఎక్కువై... అరాచకం, అశాంతి !
ఎద్దు ఎండకు లాగుతుంటే... 
ఎనుపోతు నీడకులాగినట్టు... 
ఎంతశ్రమించినా మనప్రగతి రధం.. ముందుకు సాగటం లేదు !
    వీటికి తోడు... గోతికాడి నక్కల్లా శత్రుమూకలు !
   బిడ్డలేమైపోతారో నని ఈ తల్లికి తీరని దిగులు.... !!
     ******

కామెంట్‌లు