పిట్ట తెలివి (బాల గేయం)- ఎడ్ల లక్ష్మి- సిద్దిపేట
పిల్లల్లారా రారండి
చిట్టి పిట్టను చూడండి !!

వేసవి కాలం వచ్చింది
మండే ఎండలొచ్చాయి !!

అది ఎండకు తాలలేక
కొలనులోకి దూకింది !!

తామరాకు తెంచింది
కాడ ముక్కుతో పట్టింది !!

గొడుగు వోలె పట్టింది
నీడలో హాయిగ ఉంది !!

పిట్ట తెలివి చూడండి
గట్టి యోచన చేయండి !!


కామెంట్‌లు