నమ్మకు!(చిట్టి వ్యాసం)- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ఇంద్ర ధనుస్సు మనస్సు సప్తవర్ణాల ఆనందాంబుధిలో తేలమంటుంది. కేవలం ఆనందం, ఆహ్లాదం, సంతోషం, హాయి మాత్రమే కావాలంటుంది. కానీ, లోకంలో అవిమాత్రమే లేవుకదా! విచారం, దుఃఖం, కష్టం, కోపం, అసహనం కూడా ఉన్నాయికదా! మదిలోని ఆశలెప్పుడూ ఆనందదాయకాలే. కాని, అవి నెరవేరినప్పుడు మాత్రమేకదా! కోరికల గుర్రాలెప్పుడూ పరిగెడుతూనే ఉంటాయి. వాటికి సాధ్యాసాధ్యాలుగానీ యుక్తాయుక్తాలుగానీ తెలియవు. రెక్కలున్న మనసు తీరాలుదాటి ఎగిరిపోతుంది. కాని, అనుబంధాలు సంబంధాలు సుమగంధాలై బంధాలేసి మరీ బందీలను చేస్తాయి. కాలం గాలంవేసి వెనక్కి లాగినపుడు ఇంద్రధనువైనా మేఘాలమాటున దాగాల్సిందే. కాలానికి ఎదురీదే మనసుది కీలకపాత్రే. కాని, కోరికలది అక్షయపాత్రేసుమా! అందుకే ఇంద్రధనుస్సు మనస్సును నమ్మకు నరుడా!!!
+++++++++++++++++++++++++

కామెంట్‌లు