అపురూపబంధం";- కొప్పరపు తాయారు
మధురమైన ఆలాపన
మనసు నిండు భావన
మది మెచ్చు సకలం
నిజమైన బంధం !!!

మనసులో మలినం లేదు
మానవత్వం నిలుపుకొను
నిలుచు నిర్ద్వందంగా
నిజాయితీగా జీవితకాలం!!

కష్ట నిష్టూరాలలో తోడు
కలకాలం నిలుచు ఓదార్పు
కన్నీరు తుడచు చేయి
నాదనిపించు భావన!!

నమ్మకం ఇచ్చు బతుకు
బ్రతుకును బ్రతికించు
బంధాలకు బంధం
అపురూపమైన బంధం!

ఈ స్నేహబంధం
తన వారు పెరవారు లేరు
మైత్రిలో సర్వం మనదే
నీ కన్నులలో కలక

నా కంటి నీరను వాడే
నిజమైన స్నేహితుడు
 బాధ తెలిసి , ఊహించి
బలమిచ్చి నిలుపు వాడు !!

నిజమైన మిత్రుడు
జగాల మెచ్చు 
మహనీయుడు !!!

కామెంట్‌లు