శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 మాయ అంటే ఏమిటి? వేదాంతం ప్రకారం అది ఒక ఈశ్వరీయశక్తి.ఈసృష్టి అంతా అమూర్త నిత్య బ్రహ్మ నుండి ఉత్పత్తి ఐంది.ఇది వాస్తవం కాదు.దైవవిభూతివల్ల దృశ్యజగతి కన్పడుతోంది.మోహావేశంలో అవస్తువుని వస్తువుగా  అవాస్తవాలు వాస్తవంగా మిధ్యను సత్యంగా భావిస్తున్నాం.ఇదంతా భ్రమ.మాయ కి ఇంకో అర్థం భ్రమ అగ్నానం అవిద్య.ఆంగ్లంలోఇల్యూజన్ అంటాం.ఏడు మాయలున్నాయి.మహామాయా వైష్ణవీమాయ దైత్యేయి  గౌహ్యకీమాయ పైశాచీమాయ ఆసురీమాయ రాక్షసీమాయ.
మాహిష్మతీ ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో ఉన్న ప్రాచీన నగరం.ముచుకుందుడు నెలకొల్పిన నగరం.ఇప్పుడు మహేసర్ అని పిల్వబడ్తోంది.వాయుపురాణం ప్రకారం హైహయవంశరాజు మహిష్మాన్ ఈనగరనిర్మాత.హైహయరాజుల రాజధాని.మహాభారతం ప్రకారం నర్మదా నదీతీరంలో ఉంది.సహస్రార్జునుని నివాసం.బ్రహ్మపురాణం ప్రకారం నాగులు రాజధాని.కార్తవీర్యార్జనుడు దీనిని రాజధాని గా పాలించాడు.ఇతనిపేరు సహస్రార్జునుడు.పరశురాముడు ఇతన్ని చంపాడు🌹
కామెంట్‌లు