తెలంగాణ రాష్ట్రం విద్యా వ్యవస్థ జాతీయ సమావేశం ; -వెంకట్ మొలక ప్రత్యేక ప్రతినిధి

 తెలంగాణ రాష్ట్రం విద్యా వ్యవస్థ నందు "విద్యాసామర్ధ్యాల సాధన సవాళ్లు పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ , సామాజిక పరిశీలన” అను అంశంపై జూమ్ మీటింగ్ జరిగినది. ఇందులో రాష్ట్రంలోని పిల్లల హక్కుల గురించి ఆలోచిస్తున్న విద్యావేత్తలు, మేధావులు, సివిల్ సొసైటీలోని ప్రజా సంఘాలు సభ్యులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, క్రియాశీలకంగా సుమారుగా 174 వ్యక్తులు పాల్గొన్నారు. ఆ చర్చలో ముందుగా ఆర్. వెంకట్ రెడ్డి, నేషనల్ కన్వీనర్, మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ గారు మాట్లాడుతూ దేశంలోని విద్యా వ్యవస్థ యందు రాష్ట్రాలలో విద్య, సమాజంలోని పిల్లలకు ఎలా అందుతుందో అంశాన్ని భారత ప్రభుత్వం విడుదల చేసిన సర్వే నివేదిక, వాటిలోని అంశాలను తెలుపుతూ, తెలంగాణ రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో విద్యను అందించడంలో ఎంత వెనుకబాటు తన ముందు గణాంకాలతో వివరించారు. మరియు గతంలో జరిగిన ఆరు నుండి 9వ తరగతి పిల్లల సామాజిక సర్వే గురించి తెలుపుతూ, నేటి పిల్లలు ప్రభుత్వ బడుల ద్వారా విద్యను పొందలేకపోతే భవిష్యత్తులో వారు అసంఘటిత రంగంలో పేదరికంలో నెట్టబడతారని తెలియజేస్తూ, ఈ సమావేశం రాబోయే తరం గురించి ఆలోచించడం అని అన్నారు. నేటి తరం పిల్లలు నాణ్యమైన విద్యను పొందినట్లయితే వచ్చేతరం 10 ఏళ్ల తర్వాత వ్యక్తిగా తలెత్తుకొని ఉండగలుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ సిఆర్పిఎఫ్ ,శ్రీ ప్రకాష్ ,మీనా ఎస్ ఆర్ డి, సదాలక్ష్మి ఆమన్వేదిక, బసవరాజ్ ఆపాసా ,నాగేశ్వర్, వేద కుమార్, లక్ష్మయ్య, అశోక్, మురళి సాధన సంస్థ, మాధవరెడ్డి వందేమాతరం ఫౌండేషన్ ,విశ్వనాథ్, భాగ్యలక్ష్మి తల్లుల కమిటీ, తిరుపతి ఉపాధ్యాయులు ప్రభాకర్, దామోదర్ రావు, రఘు, రాములు పాల్గొని రాష్ట్రంలోని బడులలో చదువుకుంటున్న పిల్లలు విద్యాసామర్ధ్యాలు పొందడానికి విద్యాసాధన ఉద్యమం ద్వారా ఏమి చేయాలో తమ అభిప్రాయాలు వారు చేస్తున్న అనుభవాలను తెలిపినారు.
   *రాష్ట్ర ప్రభుత్వానికి నాణ్యమైన విద్య గురించి ఆలోచన రావాలి.
*కోవిడ్ ద్వారా విద్యను పొందడంలో పిల్లలు నష్టపోయారు కావున బేసిక్ విషయాలను నేర్పించడం జరగాలి.
*పిల్లలు విద్యను పొందుతున్న సమయంలో వారికి ఫౌండేషన్ లెవెల్ లో సరి చేయడం జరగాలి.
*పిల్లలు స్థాయిని తెలుసుకోవడానికి స్థాయి పరీక్ష నిర్వహిస్తే రాసిన వారు పర్ఫెక్ట్ గా రాయలేదని చాలా వెనుకబాటు తనం ఉందని అనిపించింది పిల్లలకు సామర్ధ్యాలు అందలేదు.
*నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ లో మార్పులు జరగాలి. ఈ సమస్యను రూపుమాపడానికి నిరంతరం మాట్లాడుతూ ఉండాలి.
*ఈరోజు పిల్లలు   సామర్ధ్యాల సాధనలో వెనకబాటుతనాన్ని ప్రభుత్వం ద్వారా మార్చడానికి మన వాయిస్ పెరగాలి.
*ఈ విషయంలో ప్రభుత్వాలు సామాజికవేత్తలు అందరు కలిసి ముందుకు వస్తే బాగుంటుంది.
*ఈ అంశంపై ప్రభుత్వము పూర్తి బాధ్యతను చేపట్టేటట్టు మన ఉద్యమం ద్వారా తీసుకొని రావాలి.
*తల్లుల కమిటీ కార్యకర్తలు హైదరాబాద్ నగరంలో 11 మండలాల్లో చదువుకుంటున్న పిల్లలకు స్థాయి పరీక్ష నిర్వహించగా చాలా వెనుకబాటుతనం కనిపిస్తున్నదని చెప్పినారు.
*ఈ విషయంలో మార్పు గురించి మాకు చాలా కసి ఉంది, గట్టిగా ఉద్యమిద్దమని ఉపాధ్యాయులు అన్నారు.
*కమ్యూనిటీతో కలిసి పని చేస్తే, సామర్థ్య సాధన ఉద్యమంలో ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వస్తే ,మార్పు ద్వారా పిల్లలు నాణ్యమైన విద్యను పొందగలరు.
*ఈరోజు ప్రభుత్వము పిల్లల యొక్క సామర్ధ్యాల గురించి తెలుసుకుంటున్నది కాబట్టి మనము ప్రభుత్వాన్ని ఆలోచింపజేయవలసిన అవసరం ఉంది.
*పిల్లలందరూ నాణ్యమైన విద్యను పొందడానికి ఒకే రకమైన విద్యా వ్యవస్థ ఉండాలి, పర్యవేక్షణ ఉండాలి.
*ఉద్యమం యొక్క ఉద్దేశం తల్లిదండ్రులకు చేరే విధంగా యుద్ధ ప్రాతిపదికగా మనం చేసే పని ఉండాలి.
నేను N. జనార్ధన్ రాష్ట్ర ప్రభుత్వంతో, సమాజంతో పిల్లల హక్కుల గురించి పనిచేసిన అనుభవంతో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో చదువుకుంటున్న పిల్లలు విద్యాసామర్ధ్యాలు పొందడానికి నాణ్యమైన విద్య అందుకోవడానికి విద్య శాఖ చేపట్టవలసిన కార్యక్రమం గురించి ఈ క్రింది విషయాలు అనుభవ పూర్వకంగా అందించారు.
*గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు విద్యాసామర్ధ్యాల కమిటీలు ఉండాలి.
*సమాజము పిల్లల యొక్క విద్యా సామర్ధ్యాలు పొందడానికి ప్రభుత్వం చేసే కార్యక్రమంలోని లోపాలను సరిచేయడానికి ప్రశ్నించడం జరగాలి.
*ప్రభుత్వం ఈ సమస్యను తెలుసుకోవడానికి మనము విద్యా సామర్ధ్యాల సాధన ఉద్యమం ఒత్తిడి కలిగేటట్లు ఫోర్సిబుల్ గా కార్యక్రమాన్ని చేయాలి.
*విద్యా వ్యవస్థలోని లోపాలను ప్రభుత్వం ద్వారా సరి చేయడం జరగాలి .
*విద్యను అందించడంలో ప్రభుత్వానికి ఓనర్షిప్ లేదు దానిని రప్పించేటట్లు చేయడం.
*ప్రభుత్వము షార్ట్ టర్మ్ కాకుండా విద్యపై లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి దాని గురించి ప్రభుత్వాన్ని నిరంతరం ఆలోచింప చేయాలి.
*ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఉండాలి.
*సమాజం విద్య పొందడం Expend చేయాలి కానీ, ఎక్స్క్లూజివ్ కాకూడదు.
*ప్రభుత్వ పాఠశాలలో అభ్యసన సామర్ధ్యాలు మెరుగుపరిచేందుకు ఏడాది పొడవునా మిషన్ బునియాద్ పెట్టేటట్లు ప్రభుత్వాన్ని ఆలోచింప చేయాలి.
*క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసే  గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులు, చదువులో వెనుకబడిన విద్యార్థులు ఎలా చదువుతున్నారో పరిశీలన చేసి నివేదికలు తయారు చేయాలి. దాని ద్వారా పిల్లలు నాణ్యమైన విద్యను పొందేటట్లు చేయాలి.
*పిల్లల గురించి వారు నాణ్యమైన విద్య పొందే హక్కు కాపాడడానికి ఈ ఉద్యమంలో కొత్తవాళ్లు ఎంతమంది చేరిన వారితో కలిసి పనిచేయడం జరగాలి. అను అంశాలను చర్చ ముందు పెట్టడం జరిగింది.
             సమావేశంలో చివరగా ఆర్ వెంకట్ రెడ్డి గారు మాట్లాడుతూ పిల్లలు వెనుకబడిన వారు కాదు వెనుకబడిసినవారు అని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగ వ్యవస్థలో ఉన్న అధికార అనది కారులు ఉన్న పిల్లలు మంది పిల్లలు అని, మన పిల్లలు వారు కాదు అనే ఆలోచన ఉంది. ఇది పోయేటట్లు చేయాలని, ఈరోజుల్లో చదువులు నేర్పించడం రాజకీయ సమస్య కావున, మనము ఈ విషయంలో We need learning guarantee ఇటువైపు మన పనిలో పిల్లల గురించి పిచ్చి పట్టాలి. పిల్లల పైన బద్నాం చేయకండి . పిల్లలపై చేసే తప్పుడు ఆర్గ్యుమెంట్స్ లో ఇరికిపోవద్దు మనం మనకు ఇప్పుడు పిల్లల పక్షాన ఆలోచిస్తే చదువుకునే పిల్లలు  సంక్షోభంలో ఉన్నారు. దీని గురించి ప్రభుత్వం ద్వారా ఇమీడియట్లీ యాక్షన్ వచ్చేటట్లు మనము ఉద్యమిద్దము అని అన్నారు.

కామెంట్‌లు