.కోరాడ మినీలు... !

   @ కామాతురాణాం... !
.          ******
వివాహ బంధం వెక్కిరించింది 
 శారీరక సుఖం లోపించి !
 అక్రమాలకూ దారితీయించింది 
    భర్తనే హత్యచేయించి... 
  మాతృ హృదయాన్ని  మంటగలిసి, 
 బిడ్డలను అనాథలను చేయించింది !!
         ******
" కామం " పిచ్చెక్కించింది 
  విటుని కోసం వెంపర్లాడించింది !
   భర్త ప్రేమాను రాగాలనూ మరపించింది !
  వివాహబంధాన్ని, పేగుబంధాన్ని, ఛిద్రంచేసి... 
సమాజం ముందు క్షమించరాని నేరస్తు రాలిగా నిలబెట్టింది !!
లైంగిక సుఖం ఎంత నీచమైనది...!!!
        *******
మనిషిని... మనిషిగా కాక... 
 మృగంలా...మార్చేసే..... 
  స్త్రీపురుష వాంఛలకు.... 
   ఎన్ని జీవితాలు బలైపోతున్నై! 
   అన్ని అనర్ధాలకూ మూలమైన... 
  ఆ కోరికను నియంత్రించి, జయించగలవారే కదా.... 
.. జీవితంలో... 
   నిజమైన విజేతలు !! 
   ******
కామెంట్‌లు