నిజాల నిప్పు కణికలు;- -'బాలబంధు' గద్వాల సోమన్న
మల్లెపూవు వంటిది
పసి పిల్లల మేను
తల్లి మనసు వంటిది
నిండు పంట చేను

దాహార్తి తీర్చును
పరుగు తీయు యేరు
గౌరవం ఒసగును
బాగుంటే తీరు

కీర్తిని తెచ్చిపెట్టు
మంచిదైతే నోరు
స్ఫూర్తిని పంచిపెట్టు
మహిలో చెట్టు వేరు

సాహసమే ఊపిరి
తెలుసుకున్న చదువరి
సృష్టిలో వస్తువులు
బోధించే గురువులు


కామెంట్‌లు