ప్రభుత్వ పాఠశాల విద్య అంటే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అంతంతమాత్రంగానే బోధిస్తున్నారని బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా లక్షలాది రూపాయల నిధులు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక వసతులు పెంపొందించడంతోపాటు మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్తకొత్త విద్యా విధానాలను ప్రవేశపెడుతున్నప్పటికీ ప్రజల్లో దీనిపై ఆసక్తి క్రమేపీ తగ్గుతూ వస్తోంది. ప్రయివేటు పాఠశాలలకు దీటుగా విద్యను అందిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ అవి క్షేత్రస్థాయిలో మాత్రం అమలుకావడం లేదు. దీంతో అప్పుచేసైనా తల్లిదండ్రులు వేలకు వేల రూపాయలు ఫీజులుకట్టి ప్రయివేటు పాఠశాలల్లో చదివించడానికే మొగ్గుచూపుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఎప్పటిలాగే పాఠ్యపుస్తకాలు కూడా అరకొరగానే వచ్చాయి. లక్షలాది రూపాయల నిధులు వెచ్చించి అవసరం లేనిచోట కూడా భవనాలు నిర్మించడం వల్ల విలువైన ప్రజాధనం వృథా అవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలల విద్యపై ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా ఉపాధ్యాయుల చేత పనిచేయించడంతో పాటు అవసరమైన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి