సుప్రభాత కవిత ; -బృంద
అందమైన జగతిలో
అందరూ  ఒంటరే!
ఆశతో ప్రగతిని
ఆశించు మనసులే!

ఊయలూపే ఊహలు
మాయచేసే మోహాలు
మాసిపోని అహాలు
కానరాని స్నేహాలు

గుండె నిండిన కోరికలు
తీరం దాటని కెరటాలు
ఎడారంటి జగతిలో
ఎండమావికై ఆరాటాలు

కలలేమో కన్నుల వరకే
మమతలేమో మిన్నులంటె
మోయలేని భారాల
మాయచేయు ఊహలు

ఆనందం ఆలోచనల్లో
సంతోషం సన్మార్గంలో
ఆత్మీయత అందరితో
ఆప్యాయత అంతరంగంలో

అందరిలో ఒక్కరై
అందరూ మనవారై
సర్వులూ కుశలముగా
ఉర్విలో వెలగాలి

మనదన్నది మనతో ఉన్నది
రేపన్నది ఎపుడూ ఉన్నది.
ఆశతో జీవించడమే
అంతంలేని ఆనందం.

జీవితంలో వెలుగులు నింపే
మధురమైన ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు