నా ప్రాణం తెలుగు.; - ఎం డి. రియాజ్
తెలుగు భాషలో ఉన్నది అందం
అది నిలుపుతుంది మానవత బంధం,

తెలుగు చదివితే వస్తుంది ఆనందం
తెలుగులోనే ఉంది ఆహ్లాద సుగంధం ,

తెలుగు భాష అంటేనే మధురం 
తెలుగుజాతి కది గొప్ప వరం,

తెలుగు భాషలో ఉంది విద్యాబంధం 
తెలుగు భాష అంటేనే చక్కదనం ,

తెలుగంటే మాకు ప్రాణం
తెలుగు భాషకై జీవిద్దాం మనం.

కామెంట్‌లు