బీరయ్య తాత వచ్చిండు
బీరపాదు నాటిండు !!
చిన్నగా పందిరి వేసిండు
మెల్లిగా తీగ పారింది !!
బిర బిర మొగ్గ లేచింది
బీర చెట్టు పూసింది !!
చిన్నగా పిందెలు వేసింది
కాయలు పెద్దగా పెరిగాయి !!
తాత వచ్చి చూసిండు
బీరకాయలు కోసిండు !!
అవ్వ చేతికి ఇచ్చిండు
అవ్వ కూర వండింది !!
కంచాలన్నీ కడిగింది
కూరా బువ్వ పెట్టింది !!
బొజ్జ నిండా తిన్నాము
హాయిగా నిద్రపోయాము !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి