కిసాన్ బంధు సౌజన్యంతో అనాధ కుటుంబాల విద్యార్థులకు ఆర్థిక సహాయం;- వెంకట్ మొలక ప్రత్యేక ప్రతినిధి,


 తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్కిసాన్ బంధు సతీష్ స్నేహ సౌజన్యంతో తెలంగాణ విద్యావంతుల రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో మండలం చెందిన అనాధ ఏడవ తరగతి చదువుతున్న మీనాక్షి అనే విద్యార్థి తల్లి అనసూయకు తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు రవీందర్ గౌడ్ 12000 రూపాయలు ఆర్థిక సాయం వారి కుటుంబానికి అందించారు
రైతు కుటుంబాల్లో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబాలను ఆర్థిక సాయం అందించాలని సౌద్దేశంతో గత మూడు సంవత్సరాల నుండి ఆర్థిక సాయం అందిస్తున్నామని అనాధ కుటుంబాలకు ఆసరా అవుతూ పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న కిసాన్ బంద్ ప్రతినిధుల సహకారంతో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని అనాధ కుటుంబాలకు ఆర్థిక సహాయం కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారుఈ కార్యక్రమంలో పిఆర్టియు అధ్యక్షులు అనిల్ కుమార్ నరేందర్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌లు