*అదేకదా... దానికున్న... గోప్పతనం* ;- కోరాడ నరసింహా రావు !

గొప్ప - గొప్ప  డాక్టర్ లు... 
    లాయర్ ల సరసన కూచోబెట్టింది !

పెద్ద, పెద్ద  మినిష్టర్లు, కలెక్టర్ల  చేత.... సన్మాన సత్కారాలు చేయించింది !

ఎందరో స్నేహితులను... 
   ఎందరెందరో అభిమానులను సమకూర్చింది !

ఎన్నో, ఎన్నెన్నో సభలు, సమావేశాలలో..., చప్పట్లతో  పులకింప జేసింది !!

గొప్ప పేరు, ప్రఖ్యాతులు... 
    సిరి, సంపదల ననుగ్రహించింది !

అతి సామాన్యుని, మాన్యుని చేసి గుర్తింపుని, గౌరవాన్ని ఇచ్చింది... !

గొప్ప కులమూ కాదు..., 
 సంపన్న కుటుంబమూ కాదు !
ఇవన్నీ...ఓ సామాన్యవ్యక్తికే..!?

ఔను... అదేకదా..... 
  సంగీత, సాహిత్యాది... 
     కళ ల కున్న గోప్పతనం !
     ********
కామెంట్‌లు