సమస్యాపూరణం ;- మచ్చ అనురాధ- సిద్దిపేట

 "మంగళసూత్రమున్ మహిళ మానక కట్టెను భర్తకుం దమిన్"
===========================================
ఉత్పలమాల 
భంగము గాదె!  సంస్కృతికి భారత దేశపు‌  గౌరవమ్ముకున్! 
సంఘము నందు వింత యిది, చక్కని నాటక  సన్నివేశమే! 
రంగము  పైన భార్య యనురాగము తోప్రజ గాంచుచుండగన్
మంగళ సూత్రమున్ మహిళ మానక గట్టెను భర్తకుం దమిన్.

కామెంట్‌లు