మువన్నెల జెండా(బాల గేయం)-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
ముద్దుల పాప వచ్చింది
శుద్ధ ముక్కను పట్టింది
అక్షరాలు దిద్ది పాప 
ముత్యాల వలె రాసింది!

గురువు పాపను చూసారు
ఎంతో మెచ్చుకున్నారు
చదువుల తల్లిని పిలిచి
చక్కగా దీవించారు!

ఇంటికి పాప వచ్చింది
నాన్నగారికి చూపింది
అమ్మ వద్దకు వెళ్లి
 అక్షరాలను చదివింది!

బిడ్డ చదువు చూసి వారు
హృది నిండా మురిసి నారు
తెచ్చినారు బాలశిక్ష
పాప చేతికిచ్చినారు!

జెండా నేమొ చూసింది
జెండా బొమ్మ దించింది
మూడు రంగుల జెండా
ఎంత అందమైన జెండా!

మన మువ్వన్నెల జెండా
ఊరు వాడల్లొ నిండా
పురమంతా ఎగురుతుంది
 పాప మనసులో జెండా!


కామెంట్‌లు