మనసును కడిగెయ్యి
మురికిని తీసివెయ్యి
మనసును మార్చెయ్యి
మూర్ఖత్వము మానెయ్యి
మనసును కట్టివెయ్యి
స్థిమితము పొందెయ్యి
మనసును కరిగించెయ్యి
మానవతను చాటెయ్యి
మనసుకు నచ్చచెప్పేయి
మోసాలను మానిపించెయ్యి
మనసును తట్టిలేపేయి
మేనును మురిపించేయి
మనసుని దారికితెచ్చుకోవోయి
మంచికార్యములను చేయవోయి
మనసును మాట్లాడించెయ్యి
మమతను చూపించెయ్యి
మనసుకు ముందుచూపివ్వవోయి
మంచిదారిన నడవవోయి
మనసును పొంగించెయ్యి
మంచికవతలు వ్రాసెయ్యి
మనసుచెప్పినట్లు నువ్వువినకోయి
నువ్వుచెప్పినట్లు మనసువినాలోయి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి