న్యాయాలు -216
రాజ పుత్ర వ్యాధ న్యాయము
*****
రాజ పుత్రుడు అంటే రాజు యొక్క కుమారుడు.వ్యాధుడు అంటే బోయవాడు.
అనుకోకుండా ఒకసారి రాజు యొక్క పుత్రుడు పసి వయసులో తల్లిదండ్రులైన రాజ దంపతుల నుండి అడవిలో తప్పిపోతాడు.అప్పటి నుండి అడవిలో తిరుగుతూ వేట వృత్తి గల వ్యాధుల/ బోయల చేతుల్లో పెరుగుతాడు. యుక్త వయస్సు వచ్చిన తర్వాత కూడా అతడు తాను వ్యాధుడిననే అనుకుంటూ వుంటాడు.
ఒకనాడు కొందరు రాజపుత్ర కుటుంబీకులు అతనిని రాజ పుత్రుడని గుర్తిస్తారు .వెంటనే వెళ్ళి ఆ రాజ కుమారుడికి అతని జన్మ వృత్తాంతం మొత్తం చెప్పి అతనిలోని వ్యాధుని లక్షణాలు అంటే ఆటవిక లక్షణాలు తొలగేలా చేస్తారు.
ఇలా తనకు సంబంధించిన జన్మ వృత్తాంతం తెలిసిన వెంటనే ఆ రాజ కుమారుడు వ్యాధత్వ బుద్దిని అంటే బోయల బుద్ధిని వదిలేసి తల్లిదండ్రులైన రాజ దంపతులను చేరుతాడు. ఆ తర్వాత తండ్రైన రాజుకు వారసుడుగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు.
అయితే పెద్దలు ఈ న్యాయములోని అంతరార్థాన్ని నిశితంగా రెండు రెండు రకాలుగా చూడమని చెబుతుంటారు.
ఒకటేమో ఆధ్యాత్మిక చింతనతో చూడటం. మరొకటి.భౌతిక పరమైన దృష్టితో చూడటం.
భౌతిక దృష్టితో చూసినప్పుడు"నేను అంటే ఎవరు?" అనే ప్రశ్నకు సమాధానము"బంధాలు అనుబంధాలు, ఇతరులతో ముడిపడిన గుర్తింపులు... తల్లి, చెల్లి లేదా తండ్రి, కొడుకు... కుటుంబంలోని బంధాలతో సృష్టించబడే గుర్తింపు అన్నమాట. పుట్టినప్పుడు మనం ఎవరమ?కులం, మతం ఏమిటో మనకు తెలియదు. పుట్టిన తర్వాత వలయాలు వలలుగా మన చుట్టూ ఇవన్నీ అల్లుకుని మనం ఫలానా అనే గుర్తింపు పొందడం జరుగుతుంది. దీనినే భౌతిక పరమైన దృష్టి అంటారు.
ఇక ఆధ్యాత్మికంగా పరంగా చూసినట్లయితే "నేను ఎవరు? నేనేం చేయాలి?ఈ లోకంలోకి వచ్చినందుకు నా జీవితంలో ఉండాల్సిన లక్ష్యాలు ఏమిటి? అంతిమంగా నేను సాధించాల్సిందేమిటి?ఈ శరీరంలో ఉండే ఊపిరే నేను కాదు కదా!?" అనే ప్రశ్నలతో పాటు అంతకు మించినది ఇంకేదో ఉందని భావించడం.అదే కనిపించని మనసు, న్యాయ నిర్ణేతగా తప్పొప్పులు సరిదిద్దే అంతరాత్మ... వీటిని అన్వేషిస్తూ, ఆలోచిస్తూ పోతే ''నేను' ఈ దేహాన్ని కాదు ఆత్మను"అనే స్ఫురణకు వచ్చేలా చేసే ఆధ్యాత్మిక దృష్టితో చూడమంటారు.
ఇలా రెండు రకాల దృష్టి కోణాలు వుంటాయి. దానిని రాజ పుత్రుడి విషయంలో చూసినట్లయితే,..
తనను బోయలు పెంచడం వల్ల వారే తన వాళ్ళు ,తాను వాళ్ళకు చెందిన వాడినని అనుకున్నాడు. ఇది తనకు తెలిసిన భౌతిక పరిసరాలు, దృష్టి వల్ల.
ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే తానెవరో ఇతరుల ద్వారా తెలుసుకుని అప్పటి వరకు పెరిగిన, పెంచుకున్న బంధాలను తెంచుకుని రాజ పుత్రుడిగా జీవితం కొనసాగించడం... దీనినే ఆధ్యాత్మిక చింతనలో "తానెవరో తెలుసుకోవడం అన్న మాట"
ఇలా రెండు కోణాల్లోంచి ఈ "రాజ పుత్ర వ్యాధ న్యాయము"ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి