సమస్యాపూరణం;- మచ్చ అనురాధ-సిద్దిపేట
 "గర్భము దాల్చె సర్పమన గప్పయె కారణమాయె వింతగన్ "
-------------------------------------------------------------------------
‌దర్భల మధ్య సర్పమును తాండవ మాడగ కప్పగెంతగన్  
నిర్భయమొంది మానవులు నేమము దప్పిన పిచ్చివాగుడే
నర్భకులాడు మాటలకు నందరు నవ్విరి  సాధ్యమా! ధరణ్ 
గర్భము దాల్చె సర్పమన గప్పయె కారణమాయె వింతగన్! .

కామెంట్‌లు