* బాలగేయం *; - కోరాడ నరసింహా రావు
తాతగారి ఊరునుండి 
     కాకి వచ్చెను... 
  మంచి కబురునొకటి 
      అది మోసుకొచ్చేను !

ఉడుత ఒకటి జామ చెట్టు 
    మీది కెక్కెను.... 
  పచ్చి జామకాయ కొరికి 
     పాడుచేసెను... !

మా  పెరటి చెట్టుమీది కొక 
     చిలుకవచ్చెను... 
   దోర జామపండు నొకటి 
     బాబు కిచ్చెను...! 

పురివిప్పిన నెమలి 
 బాబు చెంతకొచ్చెను 
  అందమైన నెమలి ఈక 
     నొకటి ఇచ్చెను... !

బాబు, నెమలి కన్ను 
పుస్తకంలో దాచి పెట్టెను... 
 అదిపిల్లను పెట్టునని ప్రతి 
    రోజూ చూచును.. !

కోయిలొకటి మా పెరడుకి 
   వచ్చుచుండెను... 
 కుహు - కుహు మని కమ్మగ
    పాడుచుండును.. !

బాబుకూడ కోయిలతో 
    గొంతు కలుపును... 
అది చూసిన మా మనసులు  
    పులకరించును ... !
   *******

కామెంట్‌లు