యువతా! నిన్ను నీవు తెలుసుకో!;- - డా.పివిఎల్ సుబ్బారావు. విజయనగరం.
1. ఓ యువతా! 
     మీరే ఈ దేశ భవిత!
   
  మీరే తెలియజెప్పాలి,
        దేశ ఘనత!
 
మిమ్మల్ని మీరు,
 సరిగా మలచుకోవాలి!
 
తప్పనిసరిగా మీరు,
 జీవితాన్ని గెలుచుకోవాలి! 

పదండి ముందుకు,
            పదండి పైపైకి !

ఆదర్శంగా బతికి,
 ఆనందాన్ని పంచేటందుకు!

2.
జీవితం కల కానిది,
                  విలువైనది!

 వరమై వచ్చింది,
         వశం చేసుకోండి!
 
'అభ్యుదయం" లేదు, 
సరిహద్దు, ఆకాశమే హద్దు! 

నిన్న మరవద్దు,
      నేడు ఆగద్దు, 
        చూడు ప్రతి పొద్దు.!
3.
మీకు సమున్నత ,
        లక్ష్యం ఉండాలి!
 
నిరంతరం అలుపెరుగని, ప్రయత్నం ఉండాలి!
 
లక్ష్యం చేరే దాకా,
 ఆగకుండా ఉండాలి!

 బతుకు చిన్నప్పుడు,
    ఆడిన వైకుంఠపాళీ!

 మింగడానికి వచ్చే ,
పాముల పడగలు తొక్కాలి !

పైకి తీసుకెళ్లే నిచ్చెనల,
 మెట్లు గబగబా ఎక్కాలి.!

4.
ఓ వివేకానందుడు! ఓ కలాం! 

నీ కళ్ళ ముందు,
 ఎప్పుడూ ఉండాలి !

యువతా!
 దేశ జనాభాలో ,
   మీరే అధిక శాతం!

 మీ కృషే!
  దేశం సాధించు ,
      ప్రగతి శతశాతం!

*.            *.           *.         *

కామెంట్‌లు