భవభూతి;- కొప్పరపు తాయారు

  కవిత్వశైలి : ఈయన కవిత్వ శైలి ప్రౌడ గంభీర శైలిలో కొనసాగుతుంది ఇతని కవిత్వంలో కళాత్మక ప్రదర్శన కన్నా భావావేశ ప్రకటన కు ప్రాధాన్యం కనిపిస్తుంది భావ తీవ్రత ,భావ వేశం  నిసర్గతులు అధికంగా కనిపిస్తుంది. అనితర సాధ్యమైన శబ్ద విన్యాసం ద్వారా తన భావాన్ని స్పురింపజేయడం భవభూతికి కరతలామలక మైన విద్య. రౌద్ర బీభత్సా రస పోషణ లో క్లిష్టపద భూయిష్టమైన దీర్ఘ సమాసాలను శక్తివంతమైన పదావళిని ప్రయోగం చేస్తూ సన్నివేశాలు ప్రౌఢంగా వర్ణిస్తారు 
              ‌ కవిత్వం గౌఢీ రీతి ప్రధానమైనది. దీర్ఘసమాసాలు క్లిష్ట పదాలు తోటి కూడిన ఓజోగుణ ప్రధానమైనది, యుద్ధ సన్నివేశాలు వర్ణనల,లోనూ వీర రౌద్ర రసపుష్టికై ఇతని కవిత్వ ఝరీ గౌడీ రీతిలో సాగుతుంది‌ అయితే పాత్రోచితంగా నా రసాన్నికూలంగా గౌడీ రీతినే  కాక వైధర్భీ రీతిని సైతం సందర్భాను సారం ప్రయోగించారు. ఈయన వాచ్యార్థ. ప్రధానమైనది తన నాటకాలలో ఒక దృశ్యాన్ని  వర్ణించేటప్పుడు ఎక్కువ శబ్దాలు  ప్రయోగిస్తారు. క్లుప్తంగా చెప్పడం కన్నా చాలా విశ్లేషించి వివరంగా చెప్పడం ఆయనకి ఇష్టం దృశ్యాలు యదార్ధ వచనాలు .కల్పనీయత    ఉండదు.
             ఈయనకు ఇష్టమైనది మూడు నాటకాలలో వీర, కరుణ, శృంగార రసాలను చాలా గొప్పగా రచించి చూపించారు..
కామెంట్‌లు