స్థితి...!!;- ప్రతాప్ కౌటిళ్యా
నేను లోపలనే ఉన్నాను
స్థితులన్నీ వీడి గాలిగా మారాను.!!

ఇప్పటికీ నన్ను పట్టుకోలేదు
గుర్తుపట్టలేదు గుర్తుపెట్టుకోలేదు.

అందమంతా బయటే ఉంది
లోపల అంతా ముడిసరికే.

రెక్కలు కట్టుకొని పక్షిలా మారానూ
నీ చుట్టూ తిరగాలని.
ఘణ   స్థితి నుంచి ద్రవంగా విడిపోయి
దాన్నుంచి వీడిన గాలి గాడినే కానీ
నిను వీడలేదు..!!

నడిచే మనిషిని నీకు పరిచయం చేశాను.
మొలకెత్తి కొత్త విత్తనాలన్నీ పాతి పెట్టాను రేపటి కోసం.
పండించుకుని కడుపునిండా తిను
పండ్లన్నీ చెట్లకు వేలాడేసాను
ఒక్కొక్కటి తెంచుకుతిను........!!

ముత్యాలు ముట్టుకోకు పగడాలు పట్టుకోకు
రత్నాలు చేతితో తాకకు 
వజ్రాల దగ్గరికి వెళ్ళకు!!!

అక్కడ ఒక చెవుల పిల్లి
గరక తింటూ పరిగెడుతుంది
ఎదురుగా లేగ దూడ 
తల్లిపాలు తాగుతుంది.
నెమలి పురి విప్పి నాట్యం చేస్తుంది..!!

చంద్రుడు గిరగిరా తిరిగి పడిపోయాడు.
బావిలోని నీరు నిశ్శబ్దంగానే ఉంది
జలపాతం హోరుతో నిన్ను ఆకర్షిస్తుంది.

ఆవిరంతా మేఘం అయితే
గగనమంతా గాలి ఉంటే
పచ్చని పైరుకు ఏం పేరు పెడతావ్.!!

మంచు కురుస్తుంటే
వానముసురెందుకు ఆగుతుంది.
వడగండ్ల వాన ఎందుకు కురుస్తుంది.
అలసిపోయిన ఆకాశము ఆవేశపడుతుంది.
ఉరుములు మెరుపులు పరుగులు పెడుతుంటే.
నదులన్నీ సముద్రంలో కలుస్తున్నాయి.
ఇంద్రధనస్సు ఒక్కటే మిగిలింది.!!!?

ఉదయం ఈరోజు లేదేందుకు!!?
బలవంతంగా చీకటికన్నది.
పగటి పిల్లలు పాలు తాగుతున్నాయి.
మాతృత్వం మెల్లిగా మొగ్గ తొడుగుతుంది.
కళ్ళు చమరుస్తున్నవి గొంతు తడారిపోతుంది.

వెక్కిరించిన నక్కల అరుపుల సమయం ఇది.
ఎక్కడో దూరాన తోడేలు తొంగి చూస్తుంది.
ఒంటే ఒకటి ఒంటరిదయింది.
ఎడారి దాటడానికి ఇంకా ఎంతో సమయం పట్టదు.!!

పక్కన పారిజాతం విరిసింది.
కమలం పద్మాన్ని పూసింది
వీచిన గాలి గులాబీ గుమ్మానికి వేలాడుతుంది.!!?

నేల రాలుతున్న నక్షత్రాలను లెక్కపెడుతున్న జాబిల్లి.
కొత్త లోకానికి దారి చూపింది
తిరగాడే తుమ్మెదల్ని మింగేసిన పుష్పం.
అర్థరాత్రి కలువ బ్రతికించినట్లు బ్రమరాలు చెప్తున్నాయి.!!!!!?

అమృతం చంపిన రాక్షసులు
అది విషం అనుకొని వదిలేసినట్లు
ఒక్కో శిఖరం కూలిపోతుంది
శిరస్సులన్నీ పర్వతాల గంభీరంగా ఒదిగిపోతున్నాయి.

ఎక్కడి నుంచో లోపల దాక్కున్న స్థితిని
తరంగాలుగా గుర్తించి అందమంతా 

అంతేనా అంది ఎంతో ఆశతో బయటికి వచ్చిన గాలి
గాలి తర్వాత స్థితి లేని పరిస్థితి తనది.!!!

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
District president Sri Sri kalavedika.
కామెంట్‌లు