తాతయ్య సందేశం;- -'బాలబంధు' గద్వాల సోమన్న
మరుమల్లె వికసిస్తే
చిరు నవ్వు చిందిస్తే
సొగసులే విరియవా
మనసులే మురియవా

హరివిల్లు ఉదయిస్తే
పొదరిల్లు నిర్మిస్తే
కనువిందే చేయదా
పసందే కురిపించదా

పల్లెసీమకెళ్ళితే
మల్లెతీగ నాటితే
అనుభూతినివ్వదా
ఆనందం పొంగదా

బుద్ధి మంచిదైతే
శుద్ధి సొంతమైతే
జగతి మెచ్చుకొనదా
ప్రగతి హెచ్చు కాదా


కామెంట్‌లు