స్నేహం ; - కోరాడ నరసింహా రావు !

 స్నేహం.... స్వఛ్ఛమై 
   పరిమళిoచింది ... !
 స్నేహానికి స్వార్ధం సోకి..
  దుర్గంధ మయ్యింది !! 
       **** 
స్నేహమంటే..... 
     దుర్యోధన - కర్ణులదా !?
  స్నేహమంటే....
   కృష్ణ - కుచేలులదే... !
    *******
పరస్పర  ప్రయోజనo... 
   శ్రీరామ, సుగ్రీవుల మైత్రి !
     శ్రీరామునితో  విభీషణ మైత్రి
         కేవలం స్వప్రయోజనం !!
..   .. ******
 మైత్రి అంటే 
   సుఖాలలో కలవటం కాదు  
      కష్టాలలో... ఆదు కోవటం !
   అవసరమున్నన్నాళ్ళూ... 
   రాసుకు -పూసుకు తిరిగి... 
   అవసరం తీరగానే ముఖం చాటేసేది... అది  స్నేహమా !?!
       ******* 
 స్నేహం... కేవలం, స్నేహంలోని ఆనందాన్ని అనుభవించటానికి చెయ్.. !
   స్వార్ధ ప్రయోజనాలు నెరవేర్చుకోటానికి కాదు..., 
    అలా... సంహం చేసి... 
స్వచ్ఛమైన స్నేహానికి... 
  మచ్చను తీసుకు రాకు !
     *******

కామెంట్‌లు