"గెంతులు వేసే ప్రాయం";- పద్మావతి పి., హైదరాబాద్.
నిర్మలమైన పసి మనసులు..
గలగల జలజల పారే నదిలా అలలై పొంగే ప్రేమ మనసులు..!

గాలికి గుసగుసలాడే పందిళ్ళు..
నేలమ్మతో సరసాలాడే పసిడి మొలకలు..!

సెలయేరులా ఉరకలు వేసే ఆనందాల మెరుపులు మురిపించే మువ్వలు
ఆమని వసంతంలో చిగురించే లేలేత 
పల్లవులు..!

ప్రకృతి ఒడికే పులకింతలు..
సాయం సంధ్యకి వేణువు నూదే రవళులు..
ఆటల పాటల ఉల్లాసాలతో గెంతులు వేసే పూబంతులు..!

కల్లాకపటం తెలియని సున్నితమైన మనసులు..
స్నేహానికి ప్రాణం పోసి తుంటరి చినుకులు..!

బుద్ధిని యుక్తితో   కలిపేస్తూ  ఆటల అల్లర్లతో గెంతాటలు,
బిళ్ళాటలు, బంతాటలు, తొక్కుడు బిళ్ళాటలు..
శక్తిని యుక్తిని స్వస్థతను పెంపొందించే పోటీ పందేలు..!

సహనానికి-నేర్పుకి మానసిక ధైర్యాన్ని చేకూర్చే ఆటలు
బాలల భవితకు 
తొలి అడుగులు
వ్యక్తిత్వానికి దిశా నిర్దేశ సూత్రాలు..!!
*******


కామెంట్‌లు