సుప్రభాత కవిత ; - బృంద
తేటనీటి ఏటిలోన
తేలుతున్న సూర్యబింబము
తేరిపారా చూచుచున్న
తెలివెలుగుల దొంతరలో...

మనసులోని భావాలన్నీ
మర్మమెంచక తెలియచెప్పే
మమతలెన్నో నింపుకున్న
మనోహరమైన కాసారము...

మధురమైన భావనలన్నీ
మనసు పాడే రాగాలై
మదిని ఊయలలూపుచుండగ
ముదముతో మేదిని మురిసిపోయే!

కనకమయ కిరణాలన్నీ
కనులకింపుగ మెరయుచుండగ
కళకళలాడుతూ  కువలయమంతా
కర్మసాక్షిని స్వాగతించె!

గడచిన కాలము గతమైపోగా
రాబోవుకాలము అవగతమవక
నడచు క్షణమే శాశ్వతమనుకుని
వేడుకగా ఆనందించే వరమిచ్చే వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు