చిన్నారి - పొన్నారి పిల్లలు
తియ తీయని పలుకుల చిలుకలు !
రైమ్స్ పలికే కోయిలలు...
బుడి - బుడి నడకల నెమళ్ళు
నిర్మలమైన నవ్వులు...
నట్టింటి చిరు దివ్వెలు...
ఆటా, పాటల ఆనందాలు..
మేలిమి బంగరు రూపాలు !
బడికి వెళ్లే పెంగ్విన్ లు.....
తరగతిలో విరిసిన మల్లెలు
అ ల్లరిలో చిచ్చర పిడుగులు
వీరు బాల మేధావులు.. !
వీరెరుగరు పాప పుణ్యాలు
అనుకరణ లో గొప్ప దిట్టలు
ఈ రేపటి భారత పౌరులు...
మనదేశ కీర్తి శిఖరాలు.. !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి