నా తెలంగాణ నా దేశం సల్లంగుండాలే;- ప్రభాకర్ రావు గుండవరం(మిత్రాజీ )

 నా గజ్జె ఘల్లు మంటే
నీ గుండె ఝల్లు మంటది
నేను ఆట ఆడితే
నీ మనసు గుబులు గుబులు మంటది
నేను పాట పాడితే
యావత్తు తెలంగాణ నా ఏంట వత్తరు బిడ్డా 
ఎందుకో తెలుసా
నువ్వు తప్పు చేస్తూన్నావు కాబట్టి
నువ్వు ఈ తెలంగాణ తల్లికి
అన్యాయం చేస్తూన్నావు కాబట్టి
అమాయక జనులను ఆట పట్టిస్తూ 
మోసం చేస్తూన్నావు కాబట్టి
ఖబర్దార్ ఈ గద్దరన్న లేడనుకోకుండ్రి
నా తెలంగాణ ప్రతీ మనిషి గుండెల్లో నే ఉన్నాను
పుట్టలో గుట్టలో ఉన్నాను
ఈ దేశం ఈ ప్రపంచం  ప్రతీ మనసులో కొలువై ఉన్నాను
నా మనసు చాలా మెత్తది
నా తెలంగాణను నా దేశాన్ని నావారిని ఆదరిత్తే సలాం కొడ్తా దణ్ణం పెడతా 
అన్యాయాలు అక్రమాలు ఆరాచకాలతో పెచ్చు మీరుతున్నావనుకో
నీ భరతం పడతా
ప్రతీ బిడ్డా సింగమవుతుంది గాండ్రించు పులి అవుతుంది
నాయనలారా ఈ దేశాన్ని మన జాతిని సల్లంగా చూసుకోండి
**********
కామెంట్‌లు