బొమ్మల పల్లకి; - ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
జాజిపూల తోటలోనా
బాజాలే మోగంగా
బాల బాలికలంతా
చక్కని పాటలే పాడగా !!

కొమ్మ మీది కోకిలమ్మ
కుహు మని కూయగా
చెట్టు కింది నెమలి పిట్ట 
పించమిప్పి ఆడగా !!

గట్టు మీద కప్ప పిల్ల
డప్పు లేము కొట్టగా
మొగులి మీది చుక్కలన్ని
దివిటీల వోలె వెలుగగా !!

పిల్లలంతా మూగారు
చిట్టి పొట్టి బొమ్మలకు
చిన్నగా పెళ్లి చేశారు
బొమ్మల పల్లకి మోసారు !!


కామెంట్‌లు