జీవితం... !?(చిత్రకవిత)--కోరాడ నరసింహారావు

పుట్టుక... ఎదుగుదల... 
ఆరాటాలపోరాటాలతో... విజయాలు ... పరాజయాలు..., 
ఎవరే కార్యనిర్వాహాకులై.... 
.. బాధ్యతలు నిర్వర్తించినా... 
  రాజైనా... పేదైనా... 
  పాలకులైనా... పాలితులైనా 
డాక్టర్లైనా... యాక్టర్లైనా.... 
  ఇంజనీర్లయినా... సైoటి  ష్టులైనా ఎవరెవరు  ఏమైమై నా చివరకు... కళేబరమైనా మిగలక కాలి  బూడిదైపోవ టమో...
సమాధియై మట్టిలో కలిసిపోవటమో.... 
 ఇదే జీవితం... ఇదే  సత్యం... 
ఇదే నిత్యం... !, 
ఇన్ని అశాశ్వతాలలో శాశ్వతమైన సత్యమిదియే.... !
      ******
... కోరాడ నరసింహారావు !
కామెంట్‌లు