మహిమాన్వితం మృత్యు వినాశిని తీర్థం- సి.హెచ్.ప్రతాప్

 మృకండుడు, మనస్విని అనేదంపతులు తమ జీవితకాలం దేవుని ఆరాధనలోనే గడిపారు. ముసలితనంలో దేవతలు ప్రత్యక్షమయ్యారు. వరమడిగితే సంతానాన్ని ప్రసాదించమన్నారు. వందమంది వందేసియేళ్ళు జీవించే దుర్మార్గులైన పుత్రులుకావాలో – పదహారేళ్ళు మాత్రమే జీవించే ఒక్కగానొక్క సుపుత్రుడు కావాలో కోరుకోమన్నారు. మంచి కొంచెమయినా యెన్నుకున్నారు. అల్పాయష్కుడైనా ఒక్క కొడుకే కావాలన్నారు. అతడే మార్కండేయుడు!
అలాంటి మార్కండేయుడు మృత్యువు నుంచి బయటపడటానికి ' మృత్యు వినాశిని' అనే తీర్థంలో స్నానమాచరించడం  కూడా ఒక కారణమని పురాణాల కధనం.  108 దివ్య  తిరుపతులలో ఒకటైన మృత్యు వినాశిని క్షేత్రాన్ని 'బృహత్పురి' అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామివారు  'అప్పకుడత్తాన్' పేరుతోను .. అమ్మవారు కమలవల్లీ  తాయారు పేరుతో పూజాభిషేకాలు అందుకుంటున్నారు. మహామహిమాన్వితమైన మృత్యు వినాశిని తీర్థంలోనే మార్కండేయుడు  స్నానమాచరించి దీర్ఘాయువును  పొందాడని చెబుతారు. ఇక్కడ స్వామివారు పరాశర మహర్షికి ప్రత్యక్ష దర్శనం ఇచ్చాడు అని కూడా ఒక  కధనం.. 
కామెంట్‌లు