శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 భిషక్ అంటే వైద్యుడు అని అర్థం.అశ్వనీ కుమారులు వరుణుడు రుద్రుడు అందర్నీ భిషక్ అనేవారు.అశ్వినీ దేవతలు కుంటి గుడ్డివారినిబాగుచేసేవారు.వృద్ధ చ్యవనుడు పురంధిపతికి యవ్వనం ప్రసాదించిన వైద్యులు.వైదిక ఆర్యులు శల్యచికిత్సలో నిపుణులు.ఋగ్వేదంలో వీరివృత్తి వర్ణన ఉంది.
భేదాభేద్ అంటే జీవాత్మ బ్రహ్మ కి మధ్య గల భేదం అభేదంతెల్పుతుంది.దీన్నే భేదాభేద్ అని అంటారు.బాదరాయణునికి పూర్వమే జీవాత్మ బ్రహ్మ కి మూడు సిద్ధాంతాలు పేర్కొన్నారు.ఆత్మ బ్రహ్మ కి పూర్తి గా భిన్నంగా అభిన్నంగాలేదు.ఆస్మరథ్ ద్వారా నెలకొల్పబడిన భేదాభేద్ సిద్ధాంతం ప్రతిపాదనను భాస్కరాచార్యుడే విపులీకరించాడు.ఆచార్యనింబార్కుడు సంప్రదాయం లో ప్రసిద్ధి కెక్కాడు
భైరవ అంటే అర్థం రవం 
స్వరం.భయానకంగా ఉండేవాడు.చూడటానికి కూడా భీతి గొల్పుతాడు శివగణాన్నిభైరవ అంటారు.శివుని అవతారంగా భావిస్తారు.కాశీ కాలభైరవుడు అందరికీ తెల్సిన వాడేకదా🌺

కామెంట్‌లు