మార్గదర్శి ....!!----సత్య గౌరి .మోగంటి .

 నాన్నే మనతొలి హీరో
మనలనుచేయిపట్టి
ముందుకు నడిపించేవాడే నాన్న!
మనకు తెలియకుండా 
మన విజయం కోసం 
పరితపించేవాడే నాన్న!
తన బాధ తెలియనీయకుండా 
పెదవులపై చిరునవ్వుతో 
మనకు వెలుగును పంచేవాడే నాన్న!
క్రమ శిక్షణయె మనకు సుశిక్షణని
మన కోపాన్ని కూడా భరించి 
నడత నేర్పేవాడే నాన్న....!
తన అనుభవాల సారం నుండి
అమృతాన్ని పంచేవాడే నాన్న!
నాన్నంటే నీలాకాశం.....
నాన్నంటే చల్లని వెన్నెల.....
తొలి సంధ్య వెలుగుల కిరణాల 
వెచ్చదనమే నాన్న!
చల్లని వెన్నెల వెలుగు నాన్న
ఆకాశమంత తన మదిలో 
మనలను దాచుకొనేవాడే నాన్న !
'నేనిక్కడే ఉన్నానంటూ
తన సర్వస్వాన్ని మనకోసం
త్యాగం  చేసేవాడే నాన్న !
వేయేల  ....
మన సర్వస్వం నాన్నే..!!
                  ***
కామెంట్‌లు