సుప్రభాత కవిత ; - బృంద
అంతరంగాన కలిగిన
వేదనకు ఓదార్పులా

నీరవ నిశీధిలో కలిగే నిర్లిప్త
నిట్టూర్పుకు ఉత్సాహం లా

ఆలోచనల అలజడిలో
అలసిన మనసుకు చేయూతలా

దారీ తెన్నూ తెలియక
దిక్కుతోచని వేళ దొరికే తోడులా

శూన్యమైన వేణువులో
రాగం పలికించే  మారుతంలా

ఆవిరైన ఆశల కుదుళ్ళకు
అందిన జలస్పర్శలా

వేదనలో వెలితిని తరిమేసి 
అక్కున చేర్చుకునే ఆత్మీయతలా

ఓర్పుకు ఫలమై దొరికే
మార్పును తెచ్చే తూర్పుకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు