పిల్లలు చేసిన బొమ్మల పెళ్లి;- ఎడ్ల లక్ష్మి- సిద్దిపేట
పిల్లలందరు వచ్చారు
పుల్లలు విరిసి తెచ్చారు
పెళ్లి పందిరి వేశారు
మల్లెమాలలు కట్టారు!!

సీతారాముల బొమ్మలు
చిన్నగా వారు తెచ్చారు
బొడ్డు మల్లెలు తెంచారు
పీకలు వారు ఊధారు!!

సీతారాముల బొమ్మలకు 
కోక పంచలు చుట్టారు
నుదుట తిలకము దిద్దారు
బుగ్గన చుక్క పెట్టారు !!

జాజిపూలు తెచ్చారు
పూలమాలలు కట్టారు
వారి మెడలో వేశారు
వధూవరుల పెళ్లి చేశారు !!

గురుగిలో బువ్వ వండారు
ఇరుగు పొరుగు వచ్చారు
బొమ్మల పెళ్లి చూశారు
చల్లని దీవెనలు ఇచ్చారు !!


కామెంట్‌లు