వినీల సాంద్ర నీహార తటిల్లతా సుమనోహరం, దినదిన వర్ధమాన ఆలోచనామృతం, మధుర మంజుల మనోజ్ఞ దీపికాతోరణం, మౌనశబ్ద పరిష్వంగ విఛ్ఛేదనా ఝంఝామారుతం, హేమంత ఉషోదయ తుషారాల ఇంద్రచాపం నీ చిగురించిన చిరునవ్వు. అందుకే నా మానస నందనోద్యానంలో నీవు కళ్ళతోనవ్వితే కనకాంబరాలు,
సన్నగానవ్వితే సన్నజాజూలు,
ముసిముసిగనవ్వితే ముద్దమందారాలు, అరవిచ్చినవ్వితే అరవిరిసిన గులాబీలు, పకపకానవ్వితే బంతిచామంతులు నేత్రానంద మరందాలవుతాయి. నీ చిరునవ్వు శరత్కాల శర్వరీ సంతోషచంద్రికలను స్వరవంతం చేస్తోంది. నీ చిగురించిన చిరునవ్వు ప్రభాతారుణకిరణమై రసమై, సరసమై నాలోనన్ను మేల్కొలిపి మహోగ్ర నిశ్శబ్ద తమస్సును భస్మీపటలం చేస్తోంది!!!
+++++++++++++++++++++++++
చిరునవ్వు (చిట్టి వ్యాసం);- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి