"అంతులేని ఆశలు";- కొప్పరపు తాయారు
చిగురులు వేయు మదిలో
మనిషి మనిషికి మారు
జిహ్వ జిహ్వకు మారు రుచి వలె
పూలు కోరు  దేశ సౌభాగ్యానికి 

ప్రాణములు అర్పించిన సైనికుడిలా 
పాదముల చెంత నుండ
బుద్ధుని కుమారుడు రెక్కలు
 కోరె తండ్రిని వెతుక !

నాట్య కోవిదుడు కోరే
తన నాట్యం నటరాజ
రూపమున తన చెంత నిలబడ
గానకోవిదుడు  కోరే తనగానం

తన ఎదుట సరస్వతిగ నుండ  
కవి కోరే తన అనంత కవితలు
తనకై కవితా బాలలై తిరుగ
హద్దులు ఏవి కోరికలకు

కో:కోటి
రి:రిక్తమైన 
క: కలలు
అందని అవధుల చేర్చి
అలరించు గాలి గుమ్మటము వలె
శూన్య భారము నింపు !!!

కామెంట్‌లు