ఖండగతి- సి.హేమలత-పుంగనూరు
చెవిలోన గుసగుసలు తాకేను శుభవేళ
 ఎదలోన ఆశలే మురిసేను శుభవేళ

 కంటిలో నీరూపు నిలబడెను ఈవేళ 
  నా కలే నిజముగా నిలిచేను శుభవేళ 

కొంగొత్త వధువులా దేవేరి కనపడెను
 హృదయమే డోలికై ఊగేను శుభవేళ

 తనువులో తేనెలే నింపింది నెచ్చెలీ
మధువుకై మనసునే కొసరేను శుభవేళ

 వయసుకే తాపమే పెంచేను లతాశ్రీ 
ప్రేయసే వెన్నెలై కురిసేను శుభవేళ

✍🏻 లతాశ్రీ

కామెంట్‌లు