పుస్తకం జ్ఞాన జ్యోతి ;- సి.హేమలత--పుంగనూరు
ప్రక్రియ:గజల్
============
బ్రతుకుతెరువు చూపుటలో ఒక గీతం పుస్తకమే/
 చరిత్రలను నిలుపుటలో ఒక కావ్యం పుస్తకమే/

విశాల మగు జగత్తులో విషనాగులు ఎన్నెన్నో/
కాటు నుంచి తప్పించే ఓ పథకం పుస్తకమే//

జాతిమతపు భేదాలతొ బంధాలను తెంచబోకు/
ఐక్యతెంచు నాగరికల భవ్యగీతి పుస్తకమే//

అమాయకుల వేదనలే మిన్నంటూ వేళలోన/
కలమునుండి జాలువారు ఓ వ్యాసం పుస్తకమే//

సంప్రదాయ సంస్కృతులకు ఆటపట్టు భరతావని /
సత్కీర్తిని దాచుకున్న ఓ గ్రంథం పుస్తకమే//

చిన్న పెద్ద సంత సమున కుటుంబాన మెలిగెదరూ/
చక్కనైన బ్రతుకు తెలిపె
ఓ పద్యం పుస్తకమే//

కవితలతో సమాజాన చైతన్యపు ప్రోది లతా/
మార్పు కోరు మనసులలో నవ్య పథం పుస్తకమే//


కామెంట్‌లు